ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా గూటికి గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు - వైకాపాలోకి మాజీ ఎంపీ కుటుంబం

కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. భాజపా కీలక నేత మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు అధికార పార్టీ చెంతకు చేరారు. సీఎం జగన్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ex mp gokaraju gangaraju family joined ycp
సీఎంతో గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు

By

Published : Dec 9, 2019, 5:51 PM IST

వైకాపా గూటికి గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు

భాజపా నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబసభ్యులు వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గోకరాజు గంగరాజు కుమారుడు వెంకటకనక రంగరాజు, సోదరులు గోకరాజు రామరాజు, వెంకట నరసింహరాజు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. సీఎం అమలు చేస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు గోకరాజు కుటుంబీకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details