ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు' - Narasaraopet Parliamentary TDP President gv Anjaneyulu latest comments

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచే విధంగా వైకాపా నేతలు వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే, నరసరావుపేట పార్లమెంటరీ తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండ పురపాలక సంఘ ఎన్నికల్లో కొంతమంది పోలీసులు వైకాపా తొత్తులుగా మారారని దుయ్యబట్టారు.

Narasaraopet Parliamentary TDP President gv Anjaneyulu
నరసరావుపేట పార్లమెంటరీ తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు

By

Published : Mar 11, 2021, 8:21 AM IST

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అరాచకాలకు పాల్పడి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని మాజీ ఎమ్మెల్యే నరసరావుపేట పార్లమెంటరీ తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచే విధంగా వైకాపా నేతలు వ్యవహరించారని ద్వజమెత్తారు. వినుకొండ పురపాలక సంఘ ఎన్నికల్లో కొంతమంది పోలీసులు వైకాపా అనుకూలంగా నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు.

సీఐ చిన్న మల్లయ్య తెదేపా అభ్యర్థులను బెదిరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బంధువు అయిన పట్టణ ఎస్ఐ వెంకట్రావు తెదేపా కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేశాడన్నారు. సత్తెనపల్లిలో మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఓటర్లు తెదేపాకు ఓట్లు వేస్తున్నారనే భయంతో వైకాపా దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details