రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రతి స్కాంలకు నిలయమైందని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యాఖ్యానించారు. అముదాలవలసలో స్పీకర్, ఆయన కుమారుడు ప్రతి ఇంటి పట్టాకి రూ.50వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పేదలందరికీ ఇళ్ల పేరుతో రూ.14 వందల కోట్లు స్కాం చేశారని మండిపడ్డారు.
'పేదలందరికీ ఇళ్ల పేరుతో అక్రమాలు చేస్తున్నారు' - పేదల ఇళ్ల స్థలాలపై కూన రవికుమార్
వైకాపా నేతలు పేదల ఇళ్ల పట్టాల సేకరణలో అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. పేదలందరికీ ఇళ్ల పేరుతో రూ.14 వందల కోట్లు స్కాం చేశారని ఆయన ఆరోపించారు.
వైకాపాపై కూన రవికుమార్
పేదల ఇళ్ల పట్టాల్లో స్కాంపై సిట్టింగ్ జడ్డితో విచారణకు మంత్రి బొత్స సత్యనారాయణ సిద్ధమా? అని కూన సవాల్ విసిరారు. బీసీలు, మైనార్టీలు, గిరిజనులకు రాష్ట్రంలో నివసించే హక్కు లేదా అని కూన రవికుమార్ నిలదీశారు. బలవంతపు భూసేకరణ చేసి పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వైకాపా నేతల దోపిడీకి పేదల భూములు బలి కావాలా అని నిలదీశారు.
ఇదీ చదవండి: జులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా