ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం జగన్​ పాలనలో అన్నదాతలు వేడుక చేసుకునే పరిస్థితి లేదు' - గుంటూరు తాజా వార్తలు

రైతు అభివృద్ధి పథంలో ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు అన్నారు. ప్రజలందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత సీఎం జగన్​ పాలనలో అన్నదాతలు వేడుక చేసుకునే పరిస్థితిలో లేరని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల్లో అగ్రస్థానంలో అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్నదని ఎద్దేవా చేశారు.

ex  MLA GV Anjaneyulu
సీఎం జగన్​ పాలనలో అన్నదాతలు వేడుక చేసుకునే పరిస్థితి లేదు

By

Published : Dec 23, 2020, 6:41 PM IST

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలందరికీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడిపిస్తుందని విమర్శించారు. పేరుకే రైతు భరోసా కేంద్రాలు కానీ రైతులను వేదిస్తున్నారని ఆరోపించారు. వినుకొండలో నివసిస్తున్న పేద ప్రజలకు స్థానిక అర్బన్ పరిధిలోనే 2 సెంట్లు స్థలం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details