పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి తమ మద్దతుదారులను గెలిపించుకున్న వైకాపా.. పోటీ చేసిన తెదేపా వర్గీయులపై దాడి చేయటం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా వినుకొండలోని స్వగృహంలో ఆయన మాట్లాడారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. ఓటమి భయంతో.. సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇవ్వమనీ, ఇళ్ల పట్టాలు తిరిగి తీసుకుంటామని బెదిరించారన్నారు. ఓటర్లను ప్రలోభాలు పెట్టారని విమర్శించారు.
'పంచాయతీల్లో ఓటర్లను వైకాపా ప్రలోభ పెట్టింది..' - ex mla gv anjaneyulu latest news
తెదేపా వర్గీయులపై, వైకాపా నేతలు దాడులు చేయటాన్ని.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. ఓటర్లను ప్రలోభాలు పెట్టి పంచాయతీ ఎన్నికల్లో వైకాపా తమ మద్దతుదారులను గెలిపించుకుందని ధ్వజమెత్తారు.
పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా సానుభూతి అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. వైకాపా అరాచకాలు చేసినట్లు.. గతంలో తెదేపా దాడులకు పాల్పడితే, వైకాపా గెలిచేది కాదని అన్నారు. అధికారులను, పోలీసులను ఒత్తిడి చేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులను గెలిపించుకుందని ఆరోపించారు. తెదేపా నేతలపై దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఈ దాడులను డీజీపీ, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:మాచర్ల పురపాలిక.. ఏకగ్రీవం?