గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలుచోట్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పేకాట, గంజాయి అమ్మకాలు, బెట్టింగులు బెల్ట్ షాపులు నిర్వహణ, గుట్కాల విక్రయాలను వైకాపా నాయకులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వైకాపా నాయకులు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అసలు నిందితులను తప్పించి.. ఆ స్థానంలో అమాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తాము పోరాడుతామని తెలిపారు.
అధికారం అండతో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు: ధూళిపాళ్ల - గుంటూరు జిల్లా తాజా వార్తలు
పొన్నూరు నియోజకవర్గంలో వైకాపా నేతలు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ex mla dhulipalla