రాష్ట్రంలో వైకాపా నాయకులు దోపిడీలకు తెర తీశారని మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం లేదని చెబుతూనే... వివక్ష చూపుతున్నారన్నారు. ఆసరా పింఛన్ల ఎంపికలో వాలంటీర్లు ఇష్టారాజ్యంగా లబ్ధిదారుల నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు.
పేదల ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో పెద్ద దోపిడీనే జరిగిందని..., వైకాపా నాయకులు రైతుల వద్ద తక్కువ ధరకు భూమిని కొని ప్రభుత్వానికి అధిక ధరకు అమ్ముకుంటూ ఖాళీ చెక్కులు తీసుకుంటున్నారన్నారు. టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.