మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పట్టణ సుల్తానాబాద్‌లోని వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన తండ్రి సమాధి వద్దే రావి భౌతికకాయానికి పెద్ద కుమార్తె కిరణ్మయి తలకొరివి పెట్టారు. ఇతర కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి, కొత్త సుబ్రహ్మణ్యం, గడవర్తి సుబ్బయ్య, రావి రామ్మోహన్, ఆలపాటి వెంకట్రామయ్య పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి రావి రవీంద్రనాథ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ అంత్యక్రియలు పూర్తి - మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ మృతి
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే.. డాక్టర్ రావి రవీంద్రనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియలు సుల్తానాబాద్‌లోని వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. పలువురు నేతలు ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ex mla dead for corona cases in guntur