ప్రభుత్వం కరోనా నివారణపై దృష్టి పెట్టకుండా విగ్రహాల తొలగింపుపై దృష్టి పెట్టడం సిగ్గుచేటని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, మాజీమంత్రి జవహర్ విమర్శించారు. వినుకొండలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు దుర్మార్గపు చర్యని కాల్వ మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అనేక చోట్ల రాజకీయ దురుద్దేశంతోనే ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించారని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ఎన్టీఆర్ను దూరం చేయడం వైకాపా తరం కాదని కాల్వ తేల్చిచెప్పారు. ఇలాంటి చర్యలకు వైకాపా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందన్నారు.
'రాజారెడ్డి విగ్రహాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా..?' - jawahar comments on jagan
వినుకొండలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు దుర్మార్గపు చర్యని కాల్వ శ్రీనివాసులు, మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించి రాజారెడ్డి విగ్రహాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా..? అని నిలదీశారు. ప్రభుత్వం కరోనా నివారణపై దృష్టి పెట్టకుండా విగ్రహాల తొలగింపుపై దృష్టి పెట్టడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను తొలగించడాన్ని మాజీమంత్రి జవహార్ తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి పూట భయానకవాతావరణం సృష్టించి మీడియా ప్రతినిధులను రానీయకుండా విగ్రహాలు తొలగించాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు. తెదేపా నేతల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారన్నారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా... బడుగు, బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం నింపిన శక్తి, తెలుగు జాతి గౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించి రాజారెడ్డి విగ్రహాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా..? అని జవహర్ నిలదీశారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి..కొత్తగా 9,536 కరోనా కేసులు