'కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చి బిల్లులను వెనక్కి పంపారు'
మండలిలో ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను వెనక్కి పంపే అర్హత మండలి కార్యదర్శికి లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. చైర్మన్కు విశిష్ఠ అధికారాలుంటాయని.. మండలిలో చైర్మన్ చెప్పినట్లే జరగాలని విజయవాడలో ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్యదర్శిపై ఒత్తిడి తెస్తూ బిల్లులను వెనక్కి పంపిందన్నారు. దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని యనమల తెలిపారు.
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
TAGGED:
సెలక్ట్ కమీటి తాజా వార్తలు