EX MINISTER SUCHARITA : రాజకీయంగా తమ మనుగడ అంటే అది వైసీపీతోనే అని మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. సుచరిత ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిందంటే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడి ఉంటారని తెలిపారు. అలా కాకుండా దయాసాగర్ పార్టీ మారతాను.. నన్ను తనతో పాటు రమ్మంటే వెళ్తానని తెలిపారు. తాను ఎంత రాజకీయ నాయకురాలినైనా, ఒక భార్యగా తన భర్త అడుగుజాడల్లో నడుస్తానని ఆమె వ్యాఖ్యానించారు.
"రాజకీయంగా మా మనుగడ వైకాపాతోనే. నా భర్త దయాసాగర్ కూడా నా స్టేట్మెంట్కి కట్టుబడే ఉంటారు. ఒకవేళ నా భర్త పార్టీ మారతానంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్త అడుగుజాడల్లో నడవాలి కాబట్టి ఆయనతో పాటు వెళ్లాల్సిందే. నా భర్త ఒక పార్టీలో.. నేను మరో పార్టీలో.. మా పిల్లలు మరో పార్టీలో ఉండరు"-సుచరిత, మాజీ మంత్రి