YSRCP MLA Sucharitha: వైకాపాను వీడతానంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. రాజకీయాలలో ఉన్నంత కాలం వైకాపాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నూతనంగా నిర్మించిన పంచాయతీ దుకాణాల భవనాలు, సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. వాలంటీర్లను సత్కరించిన సభలో ప్రసంగించారు. తాను ఎప్పటికీ వైకాపాలో ఉంటానని తేల్చిచెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీరు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం ఆకర్షించేలా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
రాజకీయాల్లో ఉన్నంత కాలం వైకాపాలోనే కొనసాగుతా: సుచరిత - Farmer Home Minister Sucharitha
Farmer Home Minister Sucharitha: రాజకీయాలలో ఉన్నంత కాలం వైకాపాలో కొనసాగుతానని మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. పార్టీ విడతారనే ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వాలంటీర్లను సత్కరించిన సభలో ప్రసంగించారు.
ex minister sucharitha