ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు సరికాదు' - tdp

ఎన్నికల తర్వాత తెదేపా నాయకులు, కార్యకర్తలపై వివిధ రకాల కేసులు అక్రమంగా బనాయిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

ex_minister_pullarao_meets_tdp_leaders_in_narasaraopet jail

By

Published : Jun 11, 2019, 6:02 PM IST

Updated : Jun 11, 2019, 6:59 PM IST

'తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు'

వైకాపా నాయకుల వద్ద పేరు కోసం గొడవలతో సంబంధం లేకున్నా తెదేపా కార్యకర్తలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్​జైల్​లో ఉన్న తెదేపా కార్యకర్తలను ప్రత్తిపాటి, చదలవాడ అరవిందబాబు పరామర్శించారు. ఎన్నికల్లో గెలిస్తే.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలి గానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందన్నారు. గొడవలతో ఇరు పార్టీల కార్యకర్తలు జీవితాలు నాశనం చేసుకోవద్దని చదలవాడ సూచించారు.

Last Updated : Jun 11, 2019, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details