గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బత్తిని శారద ఇంటిపై జరిగిన దాడి(EX-MINISTER PRATHIPATI PULLARAO ON KOPPARRU INCIDENT)లో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(PRATHIPATI PULLA RAO) డిమాండ్ చేశారు. శారద కుటుంబాన్ని పరామర్శించిన ప్రత్తిపాటి.. పోలీసులు సరిగా స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
''బత్తిన శారద ఇంటిపై దాడిలో 200 మంది పాల్గొన్నారు. దాడికి సంబంధించి అన్ని వీడియో ఆధారాలున్నాయి. పోలీసుల వైఫల్యమే ఘటనకు కారణం. తెదేపా కార్యకర్తలు అండగా లేకపోతే శారదా కుటుంబాన్ని సజీవ దహనం చేసేవారు. రక్షించాల్సిన పోలీసులే..వారి ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంట్లో మిన్నకుండిపోయారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఈ ఘటనతో ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలి.'' - ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి.