అక్రమాలు అరాచకాలతో వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. సీఎం జగన్ పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. వైకాపా తరఫున పోటీచేయనని చెప్పిన తిమ్మపురంలోని వ్యక్తుల ఇళ్లపై దాడి చేయడం అందుకు నిదర్శనమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
ప్రజలే వైకాపాకు బుద్ధి చెబుతారు: ప్రత్తిపాటి పుల్లారావు - tdp on panchayth eletions
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వైకాపా పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
ex-minister prathipati pulla rao comments on ysrcp government