ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతి కోసం.. ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడం' - \ chilakalooripeta

చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. రాజధానిని తరలిస్తే మహాఉద్యమాన్ని చేపడాతమని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ex minister pattipaati pullarao preemeet at chilakalooripeta in guntur district

By

Published : Aug 21, 2019, 4:09 PM IST

Updated : Aug 21, 2019, 4:27 PM IST

చిలకలూరిపేట మీడియా సమావేశంలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు

రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు స్పందించారు. రాజధానిని తరలించే దిశగా వైకాపా వ్యవహరిస్తే మహా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అన్నివర్గాల ప్రజలు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారని...ఇప్పుడు తరలిస్తే రైతులంతా కలిసి ఉద్యమం చేస్తారనన్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి విషయంలో ప్రభుత్వతీరుపై కేంద్రం వెంటనే స్పందించాలని అన్నారు. ముంపు పేరుతో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి తెలిసే మాట్లాడారని... లక్షల మందికి అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తే తప్పకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. కృష్ణా వరదలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Last Updated : Aug 21, 2019, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details