గుంటూరు జిల్లా వినుకొండలో రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను అధికారులు తొలగించడాన్ని నక్కా ఆనందబాబు ఖండించారు. ఇది అప్రజాస్వామిక చర్యని వ్యాఖ్యానించారు. తొలగించిన విగ్రహాలను అక్కడే తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో మాయమైన అంబేడ్కర్ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అమరావతిలోని అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహాలను ప్రభుత్వమే మాయం చేయించిందని ఆనందబాబు ఆరోపించారు.
'అంబేడ్కర్ విగ్రహాలు ఎక్కడున్నాయో చెప్పండి' - గుంటూరులో అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపు వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నిచోట్ల వైఎస్ విగ్రహాలకు అనుమతి ఉందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీమంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.
ex minister nakka anandababu comments on ysrcp govt