తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో... గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆలపాటి రాజా, రైతులు నందివెలుగు సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలపాటి రాజాను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో రైతులు అడ్డుకున్నారు.
ఆలపాటి రాజా అరెస్టు... తెనాలి ప్రజల ధర్నా... - alapati rajendraprasd arrest news
తెనాలి నుంచి అమరావతికి పాదయాత్రగా వెళ్తున్న తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆలపాటి రాజాను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తెదేపా నేత ఆలపాటి రాజా అరెస్ట్
Last Updated : Jan 9, 2020, 1:26 PM IST