మానవ హక్కుల పరిరక్షణకు విఘాతం కల్గించడంతో పాటు వారి శ్రమని తీవ్రంగా దోపిడీ చేయడంలో మానవ అక్రమ రవాణా ప్రధానమైన అంశమని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టంచేశారు. మానవ హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరు పాటుపడాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 స్పష్టం చేస్తుందన్నారు. మానవ అక్రమ రవాణా నివారణా దినోత్సవం సందర్భంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదరికంలో మగ్గుతున్న మహిళలకు కొందరు వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తాం అంటూ ప్రలోభాలకు గురి చేసి వారితో అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నారని తెలిపారు. దిశ యాప్, స్పందన వంటి కార్యక్రమాలతో మహిళలు తమ సమస్యలను పరిష్కరించుకోవడం సులభతరం అయ్యిందని తెలిపారు.
'మానవ హక్కుల పరిరక్షణకు ప్రతీఒక్కరు పాటుపడాలి' - DGP Gotham savang
మానవ హక్కుల పరిరక్షణకు ప్రతీఒక్కరు పాటుపడాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 స్పష్టం చేస్తుందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. మానవ అక్రమ రవాణా నివారణా దినోత్సవం సందర్భంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డీజీపీ గౌతం సవాంగ్