CM Jagan Cheats Employees:ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలన్నారు! కానీ,నెలంతా ఎదురుచూపులే.! సకాలంలో డీఏ లు ఇస్తామన్నారు.! కొన్ని డీఏలు ఎగ్గొట్టారు, కొన్ని బకాయిల కుప్ప పెట్టారు.! పీఆర్సీ (PRC) బకాయిలు బతికి ఉన్నప్పుడే ఇస్తారా! అన్న నమ్మకం లేదు. ఇక పీఎఫ్, జీపీఎఫ్ రుణాలు, అర్జిత సెలవుల బిల్లులకు అతీగతీ లేదు.! పైగా, అడిగితే వైఎస్సార్సీపీ స్టైల్లో వేధిస్తారు? రోడ్డెక్కితే కేసు పెడతారు.! జగన్ ఏలుబడిలో ఉద్యోగుల వేదన అరణ్యరోదనే అయింది. వేతన జీవుల ముఖంలో చిరునవ్వు తెస్తానంటూ నమ్మబలికిన జగన్ అధికారంలోకి వచ్చాక వారిని దారుణంగా వంచించారు.
సీపీఎస్ ఉద్యోగులకు జగనన్న చేసిన డబుల్ మోసం: అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ (CPS) రద్దు చేస్తానన్న జగన్, ఇప్పుడు నాలుక మడతేశారు. ఆర్థిక భారమంటూ మడమ తిప్పేశారు. పైగా వాళ్ల నుంచి మినహాయిస్తున్న సొమ్మును వాడేసుకుంటున్నారు. సీపీఎస్ ఉద్యోగుల జీతాల నుంచి, ప్రభుత్వం 10 శాతం మినహాయించి, దానికి తాను మరో 10 శాతం కలిపి ఉద్యోగి ప్రాన్ ఖాతాకు జమ చేయాలి. గత ఏప్రిల్ నుంచి ఆ నిధులు జమ చేయకపోగా ఉద్యోగుల జీతాల నుంచి తీసుకున్న 10 శాతాన్ని కూడా వైస్సార్సీపీ సర్కార్ వాడేసుకుంటోంది. నెలకు రూ.250 కోట్ల చొప్పున దాదాపు రూ.2 వేల కోట్లు సీపీఎస్ ఖాతాలకు జమ చేయాల్సి ఉంది.
ఒకటో తేదిన జీతం రాదు -149 నెలలుగా డీఏ లేదు, ఈ నెల 15 న విజయవాడలో ధర్నాకు సిద్దమవుతున్న ఏపీటీఎఫ్
బకాయిలపై జగన్మోహనరాగం:ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు తెస్తానంటూఅధికారంలోకొచ్చిన జగన్ ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలిస్తున్నారా? డీఏలు, ఇతర ప్రయోజనాలన్నీ వేళకు జమ చేస్తున్నారా ? ఆర్థిక ప్రయోజనాల సంగతి తర్వాత, ఒకటో తేదీన జీతాలివ్వు జగనన్నా అంటూ ఉద్యోగులు ఆందోళనలు చేయాల్సిన దుస్థితి. 2023కు సంబంధించిన జనవరి, జులై డీఏలను ఇంతవరకు ప్రకటించలేదు. పాత డీఏ బకాయిల చెల్లింపులపై ఊసే లేదు. జీపీఎఫ్, ఓపీజీఎల్ఐ రుణాలు, అడ్వాన్సులు, పీఆర్సీ, ఈఎల్స్, డీఏ బకాయిలన్నీ కలిపి మొత్తం 20 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి సరాసరిన 2 లక్షల రూపాయలకుపైగా బకాయి పడింది. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిందంటూ 2020 జనవరి, జులై, 2021 జనవరికి రావాల్సిన మూడు డీఏల్ని ఎగ్గొట్టారు. 2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డీఏలను 2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీ లో కలిపేసి, జీతాలు భారీగా పెరిగినట్లు చూపారు. కానీ, వీటికి సంబంధించిన 54 నెలల బకాయిలను ఇంతవరకూ ఇవ్వలేదు. ఏ ప్రభుత్వమైనా తన అయిదేళ్ల పదవీకాలంలోనే బకాయిలు చెల్లిస్తామంటుంది.కానీ, సర్కార్ మాత్రం 2027వరకూ చెల్లిస్తామంటూ జగన్ మార్క్ మాయ చేస్తోంది. ఇక 11వ పీఆర్‌సీ అంతా రివర్సే. ఐఆర్ 27శాతంఉంటే చరిత్రలోనే