ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాన వార్తలు @ 3PM - ఏపీ తాజా వార్తలు

.

3pm top news
3 pm ప్రధాన వార్తలు

By

Published : Jul 31, 2020, 3:00 PM IST

Updated : Jul 31, 2020, 3:34 PM IST

1. మాతృభాషలోనే బోధించాలని ఎక్కడా లేదు
జాతీయ విద్యా విధానంపై ఏపీ ప్రభుత్వం తరపున అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేశామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు. మాతృభాషలోనే బోధించాలనే నిబంధన ఎక్కడా లేదని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా వారధి వాహనాలను ప్రారంభించిన ఆయన పాఠశాలల్లో బోధనలు ప్రారంభం అయ్యే వరకు అన్ని జిల్లాల్లో ఈ మొబైల్ వాహనాల ద్వారా చదువు నేర్పిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. వివేకా కుమార్తె సమక్షంలో అనుమానితుల సీబీఐ విచారణ!
మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 14వ రోజు కొనసాగుతోంది. వివేకా కుమార్తె సునీత సమక్షంలో వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పని మనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ్ తుల్లాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. కురిచేడు దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
రాష్ట్రంలో మద్యం ధరలు విపరీతంగా పెంచి... నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం పాడుచేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. జిల్లాల్లో వైకాపా మద్యం మాఫియా ఆగడాలు పెరిగాయాయన్నారు.కురిచేడులో శానిటైజర్ తాగి తొమ్మిది మంది మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. అటు ఉపాధి.. ఇటు పర్యావరణ పరిరక్షణ
కొండకోనల్లో పుట్టి పెరిగి, నాగరికతలో వెనుకబడిన గిరిజనులు వారు. అయితేనేం పర్యావరణ పరిరక్షణలో ముందుంటున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని తగ్గించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. జ్యూట్ బ్యాగులు తయారుచేస్తూ ఉపాధి పొందడమే కాక పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఆన్​లైన్​ 'హ్యాకథాన్'పై రేపు ప్రధాని మోదీ ప్రసంగం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ హ్యాకథాన్ గ్రాండ్ ఫైనల్‌ను ఉద్దేశించి రేపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది. ఈ 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'​ కార్యక్రమం ఆగస్టు 1 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. 'వారికి జీతాలివ్వని రాష్ట్రాలపై చర్యలు తీసుకోవచ్చు'
వైద్య సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలన్న తమ ఆదేశాలను నాలుగు రాష్ట్రాలు పాటించలేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ విషయంలో నిస్సహాయంగా ఉండకూడదని కేంద్రానికి సూచించింది ధర్మాసనం. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. టీవీల దిగుమతులపై కేంద్రం కొత్త ఆంక్షలు
కలర్ టీవీ దిగుమతుల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది కేంద్రం. దేశీయంగా టీవీల ఉత్పత్తి చేసే సంస్థలకు ప్రోత్సాహమందించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?
ఓ వైపు కరోనా సంక్షోభం అమెరికాను అట్టుడుకిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా? లేదా వాయిదా పడతాయా? అనేది హాట్​ టాపిక్​గా మారింది. అయితే నవంబర్‌ 3న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ సూచించడం చర్చనీయాంశంగా మారింది. అలా చేయడం సాధ్యమేనా? అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోందో మీరూ తెలుసుకోండి

9. సచిన్​కు ఉన్న ఏకైక ఆలోచన అదే!
సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో సరదా పోస్టులను పంచుకుంటూ ఉంటాడు క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందూల్కర్. తాజాగా వర్షంలో తడుస్తూ.. ఆస్వాదిస్తున్నప్పటి ఫొటోను పోస్ట్​ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఆ సినిమాను నాని వదులుకున్నాడా!
మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​ ఓ లెఫ్టినెంట్​ అధికారి బయోపిక్​లో నటిస్తున్నాడు. అయితే, ఈ పాత్ర కోసం నిర్మాతలు మొదట నేచురల్​ స్టార్ నానిని సంప్రదించారట. ​పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : Jul 31, 2020, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details