జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మూడులక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని నదిపరివాహక ప్రాంతం వరద ముంపులో ఉంది. నీరు పొలాల్లోకి వచ్చిచేరుతోంది. జిల్లాలో పత్తి 165, మిరప 125, మినుము 73.6, పసుపు 25.47, చెరుకు పంటలు 3.2 హెక్టార్లలో పంట నీట మునిగాయని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
వరదల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. గుంటూరు కలక్టరేట్ కంట్రోల్ రూమ్ నెం.0863-2324014, తెనాలి సబ్-కలెక్టర్ కార్యాలయం 08644-223800, గుంటూరు ఆర్డీవో కార్యాలయం నెం. 0863-2240679, గురజాల ఆర్డీవో కార్యాలయం నెం.9618617374 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.