ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో క్వారంటైన్ కేంద్రం' - ఏపీలో క్వారంటైన్ కేంద్రాలు

దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని ఏపీ వాసులు త్వరలో స్వస్థలాలకు చేరుకోనున్న నేపథ్యంలో దానికి తగ్గట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ సచివాలయాన్ని యూనిట్​గా తీసుకుని క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ నిర్దేశించారు.

cs neelam sahni
cs neelam sahni

By

Published : May 2, 2020, 11:33 PM IST

రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 10 పడకలతో కూడిన కమ్యూనిటీ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లలతో వీడియో సమావేశం నిర్వహించిన సీఎస్... ఫీవర్ సర్వేలో గుర్తించిన అనుమానితులకు త్వరితగతిన పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆరోగ్య సేతును తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని సూచించారు. టెలీ మెడిసిన్ విధానంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా మందులు పంపిణీ అయ్యేలా చూడాలన్న సీఎస్... వెటర్నరీ మైక్రో బయాలజిస్టులను కరోనా వైరస్ వైద్య సేవలకు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంటైన్మెంట్ ప్రాంతాలకు వెలుపల పరిశ్రమలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details