కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ఫొటోగ్రాఫర్లకు గుంటూరులో మక్కె ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు అందజేశారు. వారితో పాటుగా పురోహితులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా నిత్యావసరాలు అందజేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఫొటోగ్రాఫర్లకు అండగా నిలిచిన మక్కె ఫౌండేషన్ కు ఫొటోగ్రాఫర్స్ అసోషియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈటీవి భారత్ ఎపెక్ట్: ఫోటోగ్రాఫర్లకు నిత్యావసరాల పంపిణీ - etv effect
లాక్ డౌన్ కారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు ఎలాంటి కార్యక్రమాలు జరగటం లేదు. దీంతో ఫొటోగ్రాఫర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ పరిస్థితిపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి మక్కె ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటఅప్పారావు స్పందించారు. ఫొటోగ్రాఫర్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ఫోటోగ్రాఫర్లకు నిత్యావసర సరుకులు పంపిణి
ఇది చదవండికలుషిత ఆహారం తిని 20మందికి అస్వస్థత