గుంటూరు జిల్లా మంగళగిరిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వచ్చిన టిప్పర్ల బజార్, పట్టణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రజల నిత్యావసరాలను ఇళ్ల వద్దకే వచ్చి విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. 21 రకాల సరకులను 600 రూపాయలకే విక్రయించేలా మంగళగిరి మర్చంట్ అసోసియేషన్ సభ్యులను ఒప్పించారు. 21 రకాల సరకులను ప్యాక్ చేసి ఆటోలో తిరిగి విక్రయించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు విక్రయిస్తారు. ఆర్డీవో భాస్కర్‌రెడ్డి సరకు సరఫరా చేసే ఆటోలను ప్రారంభించారు.
ఇళ్ల వద్దకే నిత్యావసరాలు: మంగళగిరిలో వినూత్న కార్యక్రమం - మంగళగిరిలో వినూత్న కార్యక్రమం
మంగళగిరిలో నిత్యావసరాలను ఇళ్ల వద్దకే వచ్చి విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. 21 రకాల సరకులను 600 రూపాయలకే విక్రయించేలా మర్చంట్ అసోసియేషన్ సభ్యులను ఒప్పించారు. ఆర్డీవో భాస్కర్‌రెడ్డి సరకు సరఫరా చేసే ఆటోలను ప్రారంభించారు.
మంగళగిరిలో వినూత్న కార్యక్రమం