కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కళాకారులకు గుంటూరు రెడ్‌క్రాస్ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రరాజు, జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య పాల్గొన్నారు. మొత్తం 500 మంది కళాకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొవిడ్ కారణంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూను విధించిన నేపథ్యంలో పనులు లేక కళాకారుల కుటుంబాలు పస్తులుంటున్నాయని, వారి ఇబ్బందులు గమనించి దాతల సహకారంతో సరుకుల పంపిణీ చేపట్టినట్లు రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షులు రామచంద్రరాజు వెల్లడించారు. అర్చకులు, పేదకళాకారులకు ఎంతో కొంత సాయంచేసి ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
రెడ్‌క్రాస్ తరఫున పేద కళాకారులకు నిత్యవసర సరకులు పంపిణీ - curfew in guntur
ప్రభుత్వం విధించిన కర్ఫ్యూతో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులకు గుంటూరు రెడ్‌క్రాస్ తరఫున నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అర్చకులు, పేదకళాకారులకు ఎంతో కొంత సాయంచేసి ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
గుంటూరులో పేద కళాకారులకు నిత్యవసర సరకులు పంపిణీ