ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరెస్టైన రైతుల కుటుంబాలకు సరకుల పంపిణీ - కృష్ణాయపాలెంలో నిత్యావసర సరకులు పంపిణీ చేసిన జేఎసీ

అట్రాసిటీ కేసులో అరెస్టైన గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం రైతుల కుటుంబాలకు రాజధాని పరిరక్షణ సమితి నేతలు అండగా నిలిచారు. వారికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

నిత్యావసర సరకులు పంపిణీ చేసిన రాజధాని పరిరక్షణ సమితి
నిత్యావసర సరకులు పంపిణీ చేసిన రాజధాని పరిరక్షణ సమితి

By

Published : Oct 31, 2020, 9:26 AM IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం రైతుల కుటుంబసభ్యులకు రాజధాని పరిరక్షణ సమితి నేతలు అండగా నిలిచారు. జైలులో ఉన్న ఒక్కో రైతు కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరకులు, అత్యవసర ఖర్చుల కోసం రూ. 5 వేలఉ పంపిణీ చేశారు.

రాజధాని పరిరక్షణ సమితి కన్వీనర్ సుధాకర్, ఎస్సీ రైతుల ఐకాస కన్వీనర్ మార్డిన్.. బాధితులకు సరుకులను అందించారు. రైతులు జైలు నుంచి బయటకు వచ్చేదాకా కుటుంబపోషణను తామే చూసుకుంటామని నేతలు ప్రకటించారు.

ఇదీ చదవండి:

'ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టిన వారు రాజీనామా చేయాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details