ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉద్యోగి, సంస్థల రెండు వాటాలను మార్చి, ఏప్రిల్, మే నెలలకు ప్రభుత్వమే చెల్లిస్తుందని... ఈ రాయితీని జూన్, జులై, ఆగస్టు వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్లు ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ కుందన్ వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సంస్థలు వినియోగించుకోవాలన్న ప్రాంతీయ కమిషనర్... ఇప్పటివరకు 51.9 శాతం సంస్థలే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నాయని చెప్పారు. ఈ రాయితీని వినియోగించుకోకపోతే సంస్థతోపాటు ఉద్యోగులకూ నష్టం వాటిల్లుతుందని...ఇప్పటికైనా ఈసీఆర్లు సమర్పించాలని కుందన్ అలోక్ కోరారు.
‘ఉపశమన క్లెయింలు వేగంగా పరిష్కరిస్తున్నాం’ - guntur regional epf officer latest news
కోవిడ్-19 లాక్ డౌన్ వేళ ఉపశమన క్లెయింలు వేగంగా పరిష్కరిస్తున్నట్లు ఉద్యోగుల భవిష్యనిధి... (ఈపీఎఫ్) ప్రాంతీయ కమిషనర్ కుందన్ అలోక్ చెప్పారు. గుంటూరు రీజియన్ పరిధిలో ఇప్పటివరకు 11వేల మంది ఖాతాదారులకు రూ. 37.5 కోట్ల మేరకు క్లెయింలు మంజూరు చేసినట్లు చెప్పారు.
ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ కుందన్ అలోక్