గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి రిజర్వేషన్ అంశంపై విచారణ జరపాలంటూ ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు. శ్రీదేవి ఎస్సీ సామాజికవర్గం కాదంటూ రాష్ట్రపతికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరుపున సంతోష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి విచారణ చేపట్టాల్సిందిగా ఎన్నికల కమీషన్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఈసీ.. గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్‌ను శ్రీదేవి రిజర్వేషన్ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాలని శ్రీదేవిని.. దినేష్ కుమార్ ఆదేశించారు. ఎస్సీ రిజర్వేషన్‌కు సంబంధించిన ధృవపత్రాలతో పాటుగా.... ఆమె తల్లిదండ్రులను వెంట తీసుకురావచ్చని సూచించారు.