గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని శీతల పానీయాల లోడ్‌తో వస్తున్న వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మేరీ గ్రేస్ జూలియ మృతి చెందింది.
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి - bapatla latest news
స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని శీతల పానీయాల లోడ్‌తో వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
![రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి engineering student death in a road accident at bapatla guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11153373-224-11153373-1616664886612.jpg)
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి విద్యార్థులు.. ఇంజినీరింగ్ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటీకీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇదీచదవండి.