ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో ఇంధన పొదుపు వారోత్సవ ర్యాలీ - guntur district latest news

ఇంధనాన్ని చాలా పొదుపుగా వినియోగించుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్​ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

rally on Energy saving
ఇంధన పొదుపు వారోత్సవాల్లో నిర్వహించిన ర్యాలీ

By

Published : Dec 17, 2020, 2:16 PM IST

చిన్నపాటి జాగ్రత్తలతో ఎక్కువ మొత్తంలో ఇంధనం ఆదా చేయొచ్చని గుంటూరు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. పొదుపుగా వనరులను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన ర్యాలీని.. కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఉపయోగంలేని సమయంలో లైట్లు, ఫ్యాన్, టీవీ, ఇతర విద్యుత్ వస్తువులను ఆపేయాలని పేర్కొన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా ఇంధన పొదుపు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details