ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ రోగుల కోసం 30 పడకలు సమకూర్చిన అమెరికా సంస్థ - ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థ దాతృత్వం

అమెరికాకు చెందిన 'ఎంపవర్ అండ్ ఎక్సెల్' సీఈవో ఆయేషా చారగుల్ల, ఇండియా చాప్టర్ హెడ్ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్.. గుంటూరు జిల్లా వినుకొండలోని ఓ ఆస్పత్రికి 30 పడకలను సమకూర్చారు. సెయింట్ ఆన్స్ జేబీఎస్ ఆస్పత్రిలో వీటిని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. వారి సేవలకు కొనియాడారు.

30 beds inaugurated by mla brahmanaidu
ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

By

Published : May 16, 2021, 5:27 PM IST

కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ.. దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. అమెరికాకు చెందిన 'ఎంపవర్ అండ్ ఎక్సెల్' ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో ఆయేషా చారగుల్ల, ఇండియా చాప్టర్ హెడ్ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానిక తహసీల్దార్ అనిల్ కుమార్ సాయం చేయాలని కోరిన వెంటనే.. ఒక్కరోజులోనే గుంటూరు జిల్లా వినుకొండలో 30 పడకలను సమకూర్చారు. సెయింట్ ఆన్స్ జేబీఎస్ ఆస్పత్రిలో కరోనా బాధితుల సౌకర్యార్థం వీటిని విరాళంగా ఇచ్చారు.

ఇదీ చదవండి:'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'

వెనుకబడిన వినుకొండ ప్రాంతంలో ప్రజల ఇబ్బందులను గుర్తించి.. సాయం చేసేందుకు ముందుకు వచ్చిన కళ్యాణ్ కృష్ణ కుమార్, ఆయోషా సేవలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కొనియాడారు. రూ. 2 లక్షలు విలువ చేసే పడకలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరాళమిచ్చిన వారిని అభినందించారు. ఇలాంటి దాతలను ఆదర్శంగా తీసుకుని.. మరింత మంది సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

పిడుగురాళ్లలో 500 పడకల కొవిడ్ సెంటర్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details