సీపీఎస్ పై ప్రభుత్వంతో చర్చలకు వెళ్లొద్దని ఉద్యోగ సంఘం నిర్ణయం - CPS Meeting
08:48 December 06
ప్రభుత్వం పాత ప్రతిపాదనలపైనే చర్చించే అవకాశం ఉందని బహిష్కరణకు నిర్ణయం
CPS ISSUE : సీపీఎస్ అంశంపై చర్చలకు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించిన వేళ.. సీపీఎస్ ఉద్యోగ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పాత ప్రతిపాదనలపైనే చర్చించే అవకాశం ఉందని భావించిన ఉద్యోగ సంఘాలు.. చర్చలకు వెళ్లొద్దనే నిర్ణయం తీసుకున్నాయి.
ఇదీ జరిగింది: CPS Meeting: సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరుగనున్నట్టు ఆర్ధికశాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 20 ఉద్యోగ సంఘాల నేతలు, ప్రతినిధులకు ఆర్ధికశాఖ సమాచారం పంపింది. సీపీఎస్‌పై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్లనూ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. సీపీఎస్ అంశంపై మాత్రమే చర్చించేందుకు రావాలని ఆర్ధిక శాఖ ఆ నోట్లో పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం ఏ మెలిక పెడుతుందోనని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇవీ చదవండి: