PRC: కష్టమైనా, నష్టమైనా.. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ సాధన ప్రక్రియ ప్రభుత్వానికి, ఉద్యోగులకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్న ఆయన.. 12వ పీఆర్సీ సాధనకు వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్తామని చెప్పారు. గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సన్మాన సభలో పాల్గొన్న ఆయన.. ఏలూరులో సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళనకు మద్దతు ప్రకటించారు. సీపీఎస్ తెచ్చిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే పాత ఫించన్ విధానం అమలు చేస్తున్నారని.. సీపీఎస్ రద్దు అసాధ్యమేమీ కాదన్నారు. సీపీఎస్ రద్దు ద్వారా ఉద్యోగులు పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం నిలబెట్టాలని సూర్యనారాయణ కోరారు.
సీఎం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందే: సూర్యనారాయణ - employees union leader suryanarayana coomments
PRC: ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. సూర్యనారాయణ డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ సాధన ప్రక్రియ ఎన్నో గుణపాఠాలు నేర్పిందని.. 12వ పీఆర్సీ సాధనకు వాస్తవిక దృక్పథంతో ముందుకెళ్తామని వెల్లడించారు.
సీఎం హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందే