గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్ టెస్ట్ చేసేందుకు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ.. నరసరావుపేట మండలం ఇక్కుర్రు గ్రామానికి చెందిన కార్తీక్ అనే యువకుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కరోనా సోకి ఆస్పత్రికి వచ్చే బాధితులు ఎవరికీ ఒక్క రూపాయీ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వైద్యశాల కమిటీ అధ్యక్షుడు శేషురెడ్డి అన్నారు. ఎవరైనా సిబ్బంది డబ్బు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ఉద్యోగి... విధుల నుంచి తొలగించిన అధికారులు - narasaraopeta latest news
గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఆస్పత్రిలో ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ వైద్యశాల కమిటీ అధ్యక్షుడు శేషురెడ్డి కోరారు.
నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల