గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం నూతన పాలకవర్గం అత్యవసర సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో 10 అంశాలను చర్చించనున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీమ్ పేర్కొన్నారు. మాజీ శాసనసభ సభ్యులు, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన దివంగత అన్నాబత్తుని సత్యనారాయణ జ్ఞాపకార్ధంగా ఆయన విగ్రహాన్ని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసే అంశంపై వార్డు కౌన్సిలర్లతో చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తెనాలి పురపాలక సంఘం నూతన పాలకవర్గ అత్యవసర సమావేశం - గుంటూరు తాజా వార్తలు
తెనాలి పురపాలక సంఘం నూతన పాలకవర్గ అత్యవసర సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేయనున్నారు. పది అంశాలను చర్చించనున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీమ్ పేర్కొన్నారు.
తెనాలి పురపాలక సంఘం నూతన పాలకవర్గ అత్యవసర సమావేశం