గుంటూరులో విద్యుత్ ఉద్యోగులు నాలుగో దశ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలకు ఉద్యోగుల ఐకాస పిలుపునిచ్చింది. విద్యుత్ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని... తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ 21 రోజులుగా భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పటికీ... అవి విఫలం అయ్యాయి. లిఖితపూర్వకంగా ఎలాంటి భరోసా ఇవ్వలేదన్న ఉద్యోగ సంఘాల ఐకాస.... సమస్యలపై ప్రభుత్వం స్పందించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
రేపటినుంచి విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష: ఉద్యోగ సంఘాల ఐకాస - గుంటూరులో విద్యుత్ ఉద్యోగులు నాల్గో దశ ఉద్యమం
తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు నాలుగో దశ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పటికీ... అవి విఫలం కావటంతో ఉద్యోగ సంఘాల ఐకాస తదుపరి కార్యాచరణను ప్రకటించింది.
విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష