అసలేం జరిగిందంటే..?
ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్‌లో వైద్యవృత్తిలో ఉండేవారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైకాపాలో చేరారు. సాధారణ ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి... శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్వ్యూలో... తన కుటుంబ సభ్యుల గురించి చెబుతూ... తానూ క్రిస్టియన్ అని తెలిపింది. అక్కడే వివాదం మెుదలైంది. చిన్నప్పుడు తాడికొండ గ్రామంలోనే పెరిగానని... అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని చెబుతూ... కులాన్ని కూడా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.
26వ తేదీ.. విచారణ...
ఈ ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి... క్రిష్టియన్ అయిన శ్రీదేవి ఎలా పోటీ చేస్తారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు సంతోష్... రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అక్టోబర్ నెలలో రాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖపై స్పందించింది. ఈ అంశంపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.