ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్రంపై స్వారీ చేస్తూ మాచర్ల తెదేపా అభ్యర్థి ప్రచారం - తెలుగుదేశం

గుంటూరు జిల్లా మాచర్ల తెదేపా అభ్యర్థి అంజిరెడ్డి వినూత్నంగా ప్రచారం చేశారు. గుర్రంపై ప్రచారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అశ్వంపై స్వారీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.

గుర్రంపై ప్రచారం చేసిన మాచర్ల తెదేపా అభ్యర్థి

By

Published : Apr 2, 2019, 5:18 AM IST

ఓటర్ల ఆకట్టుకునేందుకు కాదేది అనర్హం... అన్నట్లుంది నేతలవ్యవహార శైలి. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు తమకు తోచిన విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.గుంటూరు జిల్లా మాచర్ల తెదేపా అభ్యర్థి అంజిరెడ్డి వినూత్న రీతిలో ఆలోచించారు. చిన గార్లపాడులో గుర్రంపై ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.అశ్వాన్ని ముందుగా ముస్తాబు చేసి దానిపై స్వారీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. గుర్రంపై వెళ్తుంటే కార్యకర్తలు కోలాహలంగా ముందుకు సాగారు.

ABOUT THE AUTHOR

...view details