గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో తెదేపా పుర ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెదేపా అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెదేపాను గెలిపిస్తే రేపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు.
రేపల్లెలో జోరు పెంచిన తెదేపా.. ఇంటింటికి ప్రచారం - mla satyaprasad latest news
గుంటూరు జిల్లాలో తెదేపా ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులతో రేపల్లె ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం చేశారు. తెదేపాను గెలిపిస్తే రేపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు.
రేపల్లెలో జోరు పెంచిన తెదేపా
తెదేపా హయాంలో రోడ్లు, తాగు నీటి,డ్రైనేజి సమస్యలు తీర్చమని ఎమ్మెల్యే తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. మోసపూరిత హామీలతో వైకాపా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. పట్టణంలో మొత్తం 28 వార్డులు ఉండగా.. నాలుగు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో తెదేపా పోటీ చేస్తోంది.
ఇదీ చదవండి