కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం ఏకాంతంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేశారు. గత నెల ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
'శ్రీనివాస మంగాపురం ఆలయంలో ఏకాంత పూష్పయాగం' - శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో ఏకాంతంగా పుష్పయాగం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కరోనా వ్యాప్తి నివారణ దృష్ట్యా అర్చకులు ఏకాంత పూష్పయాగం నిర్వహించారు. గత నెల స్వామివారికి జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఎవరి వల్లనైనా లోపాలు జరిగి ఉంటే పుష్పయాగం చేస్తే దోషాలు పోతాయని ఆలయాధికారులు తెలిపారు.
'శ్రీనివాస మంగాపురం ఆలయంలో ఏకాంత పూష్పయాగం'