ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలలో కొవిడ్ కలకలం... 8 మంది విద్యార్థులకు వైరస్ నిర్ధరణ - పాఠశాలల్లో కరోనా కలకలం

రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి కరోనా అందరినీ కలవరపెడుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో కరోనా కలకలం రేపింది. ఫిరంగిపురం మండలం మునగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 మంది విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు.

Eight students in Guntur were infected with corona.
పాఠశాలలో కొవిడ్ కలకలం

By

Published : Nov 24, 2020, 7:12 AM IST

పాఠశాలల్లో కరోనా ఘంటికలు మొగుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 మంది విద్యార్థులకు కరోనా సోకింది. శనివారం నాడు 30 మంది విద్యార్థులకు కొవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా...వారిలో 10వ తరగతికి చెందిన 8 మందికి వైరస్ ఉందని వైద్యాధికారులు నిర్ధరించారు. మునగపాడు గ్రామానికి చెందిన నలుగురు, బేతపూడిలో ఒకరు, గుండాలపాడులో ఇద్దరు, మేరకపూడిలో ఒకరూ వైరస్ బారినపడ్డారు.

కొవిడ్ నేపథ్యంలో.. తరగతి గదులను శానిటైజేషన్ చేయించటంతోపాటు... పదో తరగతి విద్యార్థులను పాఠశాలకు రావద్దని చెప్పినట్లు ఇంఛార్జ్ మండల విద్యాశాఖాధికారి రాజకుమారి తెలిపారు. వైరస్ బారిన పడిన పిల్లల ఆరోగ్యం బాగానే ఉందన్నారు రాజకుమారి. కొద్ది రోజుల క్రితం మేడికొండూరు మండలంలో 5గురు విద్యార్థుల, ఒక ఉపాధ్యాయుడు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మందపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు, సిరిపురం పాఠశాలలో ఇద్దరు, కొర్రపాడు పాఠశాలలో ఒక విద్యార్ధి, పేరేచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడుకు కరోనా ఉందని వైద్యాధికారులు తేల్చారు.

ABOUT THE AUTHOR

...view details