గుంటూరు జిల్లాను కరోనా వెంటాడుతూనే ఉంది. ఇవాళ మరో 8 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. తాడేపల్లి, సత్తెనపల్లిలో మూడేసి పాజిటివ్ కేసులు నమోదు కాగా... గుంటూరు ఏటీ అగ్రహారం, సంజీవయ్య నగర్లో ఒక్కో కేసు నిర్ధరణ అయ్యింది. ఇటీవల హైదరాబాద్లో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు సత్తెనపల్లిలో నిర్వహించారు. అదే కుటుంబంలోని ముగ్గురికి కరోనా సోకింది. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 600 దాటాయి. మొత్తం కేసుల్లో నాలుగోవంతు కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా కేసుల తాకిడి పెరుగుతున్నట్లు అదికారులు గుర్తించారు.
గుంటూరు గడ్డ... కరోనాకు అడ్డా..!
గుంటూరు జిల్లాలో కరోనా తాకిడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరో ఎనిమిది కేసులు నమోదు కాగా జీజీహెచ్లో కరోనా సోకిన మహిళకు అక్కడి వైద్యులు సిజేరియన్ చేయడం వల్ల 8 మంది వైద్యులు, ఇద్దరు నర్సులు, వైద్యసిబ్బంది హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
గుంటూరు జిల్లాలో కరోనా తాకిడి