ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జర్నలిస్ట్‌ కావాలనుకుంటున్నారా..? అయితే నేడే దరఖాస్తు చేయండి..!

By

Published : Nov 8, 2022, 1:54 PM IST

Eenadu Journalism School: ఈనాడు జర్నలిజం స్కూల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఆహ్వానం : అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే, ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే. కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్‌ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాం.

Eenadu Journalism School
Eenadu Journalism School

ఎంపిక:

మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్నీ, అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది.

శిక్షణ, భృతి:

ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు Rs. 14,000, తరువాతి ఆరు నెలలు Rs.15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది.

ఉద్యోగంలో:

స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో Rs. 18,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో Rs. 20,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో Rs. 22,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి.https://ejs.eenadu.net/ను క్లిక్‌ చేసి అప్లై చేయండి . దరఖాస్తు రుసుము Rs. 200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దరఖాస్తు ధ్రువీకరణ నకలును అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి.

ఒప్పంద పత్రం:

స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూపు సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.

అర్హతలు :

  • తేట తెలుగులో రాయగల నేర్పు
  • ఆంగ్లభాషపై అవగాహన లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు
  • ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన
  • మీడియాలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష
  • 23.01.2023 నాటికి 28కి మించని వయసు
  • డిగ్రీ ఉత్తీర్ణత

ముఖ్య తేదీలు:

ABOUT THE AUTHOR

...view details