"చదవు నిజ జీవితంలో ఉపయోగపడాలి" - undefined
ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బృంద సభ్యులు... గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలలో ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బృంద సభ్యులు బి.ఈశ్వరయ్య, బి.రామకృష్ణంరాజు, డీవీఆర్కే ప్రసాద్ పర్యటించారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలోని మోడల్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను పరిశీలించారు. అనంతరం చిలకలూరిపేటలోని మండలం విద్యా వనరుల కేంద్రానికి వెళ్లారు. పాఠశాలల్లో విద్యా విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని వివరించారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు ఈశ్వరయ్య మాట్లాడుతూ చదువు నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలన్నారు. అందుకు అనుగుణంగా పాఠశాలల్లో విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన విధానాలను ప్రభుత్వానికి నివేదించేందుకే తాము పర్యటన చేస్తున్నట్లు వివరించారు.