ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్‌తో చనిపోయిన టీచర్ల వివరాలను కోరిన విద్యాశాఖ... - teachers covid deaths in AP latest

teachers covid deaths in AP: కొవిడ్‌తో చనిపోయిన టీచర్ల వివరాలు సేకరించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2021 ఏప్రిల్ నుంచి జులై వరకు చనిపోయిన వారి వివరాలు సేకరించాలని పేర్కొంది. ఆర్థిక సాయం అందని టీచర్ల కుటుంబాల వివరాలు సమర్పించాలని విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీలకు ఆదేశాలు జారీ చేసింది.

teachers covid deaths in AP
కొవిడ్‌తో చనిపోయిన టీచర్ల వివరాలు

By

Published : Jan 17, 2023, 8:13 PM IST

Details of teachers died due to covid-19 in AP: కోవిడ్ -19 ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. పారిశ్యుద్ధ్య కార్మికులు, పోలీస్, రక్షణ, ఉపాధ్యాయులు... ఇలా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కోవిడ్ బారిన పడి మృతి చెందినట్లైతే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వివిధ శాఖలకు చెందిన అనేకమంది ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు కోవిడ్ వల్ల మృత్యువాత పడగా.. ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించింది. ఇదే అంశాన్ని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి శాసన మండలిలో ప్రశ్నించారు. దీంతో.. విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వం సేకరించే పని మెుదలు పెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. 2021లో కరోనా కారణంగా మృతి చెందిన ఉపాధ్యాయుల వివరాలను అందించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి: కోవిడ్-19 కారణంగా మృతి చెందిన ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు​ జారీ చేసింది. రాష్ట్రంలో ఏప్రిల్ 2021 నుంచి జూలై 2021 వరకూ సెకెండ్ వేవ్​లో మృతి చెందిన ఉపాధ్యాయుల వివరాలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కోవిడ్ ఆర్ధిక సాయం అందని ఉపాధ్యాయుల కుటుంబాల వివరాలను సమర్పించాల్సిందిగా సూచన చేసింది. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి శాసన మండలిలో అడిగిన ప్రశ్నతో కోవిడ్ తో మృతి చెందిన ఉపాధ్యాయుల వివరాలు సేకరణను ప్రభుత్వం ప్రారంభించింది. తక్షణం ఈ వివరాలను పాఠశాల విద్యాశాఖకు సమర్పించాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీలకు ఆదేశాలు ఇచ్చారు.

గతంలో కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి ప్రాణాలకు తెగించి విధులు నిర్విర్తించారు ఉపాధ్యాయులు. అయితే వారికి పరిహారం అంధించే విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిదంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి శాసన మండలిలో ప్రశ్నలు లేవనెత్తడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. అందులో భాగంగానే నేడు విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా రెండో సారి విజృంభించిన సమయంలో మృతి చెందిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించాలని నేడు విద్యాశాఖ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details