Chikoti Praveen Case: తెలంగాణలోని చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దృష్టి సారించింది. మూడునెలల తర్వాత తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్, అనుచరుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి మరో వ్యక్తికి సంబంధించి కీలక పత్రాలు బ్యాంకు ధ్రువపత్రాలు సేకరించారు. వాటి పరిశీలన తర్వాత మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. వాటి ఆధారంగా తలసాని మహేశ్, ధర్మేందర్ యాదవ్‌ని పిలిచి విచారించారు. వీరు చీకోటితో కలిసి క్యాసినో కోసం విదేశాలకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నగదు, ఆర్థిక లావాదేవీల విషయంలో హవాలాకు పాల్పడ్డారనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
చీకోటి కేసు.. మంత్రి సోదరులను ప్రశ్నిస్తున్న ఈడీ.. మరో ముగ్గురికి నోటీసులు - చీకోటి ప్రవీణ్
Chikoti Praveen: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చీకోటి క్యాసినో కేసు వ్యవహారంలో మరో విషయం వెలుగు చూసింది. ఈ కేసులో మంత్రి సోదరులకు భాగం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మధ్యాహ్నం 12గంటల సమయంలో వీరిద్దరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం
మరోవైపు ఇదే కేసులో మరికొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా మెదక్ సహకార బ్యాంకు ఛైర్మన్‌కు, ఏపీలోని అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు కూడా నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి ఈడీ విచారణకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ హాజరుకానున్నారు. సోమవారం నాడు అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అధికారుల ఎదుట విచారణకు రావాల్సి ఉంది.
ఇవీ చదవండి:
Last Updated : Nov 16, 2022, 6:08 PM IST