ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ముఖేష్ కుమార్ మీనా - Mukesh Kumar Meena

Mukesh Kumar Meena:రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మంగళగిరిలోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు. ఆయా కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థిని ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేశారు. నూతన ఓటర్ నమోదు అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

రాష్ట్ర ఎన్నికల కమీషన్
Mukesh Kumar Meena

By

Published : Nov 17, 2022, 3:26 PM IST

State Election Commission: రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన యువతను ఓటర్లుగా నమోదు చేయించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. మంగళగిరిలోని రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోని డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు. ఆయా కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేయించాలని చెప్పారు. రాష్ట్రంలోని 224 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1,20,000 మంది విద్యార్థులు ఉన్నారని.. వీరిని ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత ఆయా కళాశాల యాజమాన్యాలపై ఉందని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. నూతన ఓటర్​గా ఎలా నమోదు చేయించాలనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కళాశాలలో ఎంతమందిని ఓటర్లుగా చేర్చిందనే విషయాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పీజీ, బీటెక్ కళాశాలలో విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details