గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలోని బోదిలవీడులో ఉన్నట్టుండి భూమి కుంగిపోయి గొయ్యి పడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గ్రామంలోని ధర్మవరపు శ్రీనుకు చెందిన పొలం కుంగిపోయి పెద్ద గొయ్యి పడి ఏర్పడింది.

అందుకే చీలికాలు వచ్చాయి..
పొలం వద్దకు చేరుకున్న రైతులు అధికారులకు సమచారం అందించారు. గతంలో పలుమార్లు గ్రామంలోని భూమిలో చీలికలు వచ్చాయని, ఇంత పెద్ద గొయ్యి పడటం ఇదే మొదటిసారని రైతులు పేర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూమి కుంగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
ఇవీ చూడండి : భూ సమస్యను పరిష్కరించాలంటూ అదనపు కలెక్టర్ కాళ్లపై పడిన రైతు