ప్రతి అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చు తుది లెక్కల నకలును.. ఫలితాలు ప్రకటించిన 45రోజుల్లోగా సమర్పించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. 343-జెడ్సీ సెక్షన్ కింద అభ్యర్థి లేదా ఆయన ఎన్నికల ఏజెంట్ ఖర్చుల వివరాలను మున్సిపల్ కమిషనర్ల ద్వారా.. జిల్లా ఎన్నికల అధికారులకు సమర్పించాలన్నారు. నిర్దేశించిన సమయంలోగా సదరు అభ్యర్థి అందజేయకుంటే.. మూడేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులను చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉందని, ఒకవేళ అభ్యర్థి గెలుపొందితే.. లెక్కలను సమర్పించనందుకు వారు పదవిని కోల్పోతారని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల ఖర్చుల వివరాలు తెలపాలి: కలెక్టర్ వివేక్ యాదవ్ - గుంటూరు జిల్లా వార్తలు
ప్రతి అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చుల లెక్కల నకలును మున్సిపల్ కమిషనర్ల ద్వారా.. జిల్లా ఎన్నికల అధికారులకు అందించాలని గుంటూరు జిల్లా పాలనాధికారి వివేక్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45రోజుల్లోగా తమ ఖర్చు తుది లెక్కల నకలును సమర్పించాలని తెలిపారు.

ఎన్నికల ఖర్చుల వివరాలు తెలపాలి: కలెక్టర్ వివేక్ యాదవ్
TAGGED:
guntur collector vivek yadav